Narayana satires | బాంబు దాడుల నుంచి గులకరాయి దాడుల వరకు రావడం మంచిదే.. సీపీఐ నారాయణ సెటైర్లు
Narayana satires | సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు.
అమరావతి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Secretary Narayana) ఈసారి ఏపీ(AP) సీఎం వైఎస్ జగన్ (CM Jagan) పై సెటైర్లు వేశారు. ఇటీవల విజయవాడ సభలో జగన్పై గులకరాయితో జరిగిన దాడి ఘటనపై ఆయన తనదైన శైలీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో బాంబు దాడుల సంస్కృతి నుంచి గులక రాయికి రావడం మంచిదేనని వ్యాఖ్యానించారు. గులకరాయి దాడి అంటూ రాజకీయాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కాళ్లకు కట్టు కట్టుకుని తిరిగింది. ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్ కళ్లకు కట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు గులకరాయి కథలు అంతా తెలుసని విమర్శించారు. జగన్పై రాయి వేసిన వారిని కాకుండా మరొకరిని ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం మరణవార్త అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తప్పులు చేస్తున్న అధికారులు జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. ఈ కేసులో ఏ-1ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

