గోరంట్ల మాధవ్‌పై విచారణకు సీఎం ఆదేశం : మంత్రి రోజా
Minister Roja| హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సీఎం విచారణకు ఆదేశించారని ఏపీ మంత్రి రోజా తెలిపారు.
అమరావతి : హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ సీఎం విచారణకు ఆదేశించారని ఏపీ మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే జగన్ సహించరని అన్నారు. తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమని వివరించారు. ఎంపీ మాధవ్‌పై సోషల్ మీడియాలో వచ్చిన వీడియో కాల్ నిజమో, కాదో తెలుసుకోకుండా టీడీపీ నాయకులు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో అన్ని విషయాలు బయట పడుతాయని తెలిపారు.
ఇటీవల తన కొడుకుకు కొనుగోలు చేసిన కారు విషయంలోనూ అనవసర ఆరోపణలు చేశారని అన్నారు. చిన్నచిన్న ఆర్టిస్టులు సైతం కారును కొనుగోలు చేస్తే తనలాంటి వారు కొనుగోలు చేయడం సర్వసాధారణ విషయమని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులకు ఆరోపణలు చేయడానికి ఏమి దొరకక అనవసర వాటిపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీ హయాంలో నారాయణ కళాశాలలో జరిగిన ఎంతో మంది విద్యార్థినీలు ఆత్మహత్యలు జరిగితే స్పందించలేదని, ఏ ఒక్క కేసు నమోదు కాలేదని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

