Amaravati | అమరావతి పిటిషన్లపై ‘సుప్రీం’ విచారణ.. విముఖత చూపిన సీజేఐ
Supreme Court | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, పిటిషన్లను
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంత రైతులు, ఏపీ సర్కారు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి విముఖత వ్యక్తం చేశారు. రాజధాని పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుమారు 2వేల పేజీలతో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, హైకోర్టు ఆదేశాల ప్రకారం.. సీఆర్డీఏ ఒప్పందం అమలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. రైతులు తమ పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశాలపై స్పష్టత లేదని, తీర్పులో ప్రస్తావించిన అంశాలతో పాటు తాము లేవనెత్తిన విషయాలు పొందుపరిచేలా చూడాలని చూడాలని సుప్రీంకోర్టును కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

