శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మరికాసేపట్లో శ్రీశైల మల్లికార్జుడిని దర్శించుకోనున్నారు.

శ్రీశైలం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మరికాసేపట్లో శ్రీశైల మల్లికార్జుడిని దర్శించుకోనున్నారు. ఈ ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 9 గంటలకు శ్రీశైలం దేవస్థానం అతిథి గృహానికి చేరుకున్నారు. సీజేఐ దంపతులకు అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తోపాటు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామిఅమ్మవార్ల దర్శనం చేయించేందుకు ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం 10 గంటల 30 నిమిషాలకు తిరిగి ఎన్వీ రమణ దంపతులు హైదరాబాద్ చేరుకుంటారు. సీజేఐ పర్యటన నేపథ్యం ఆలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవలే ఆయన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

