Nagababu | నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ..?
Nagababu | ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే.
Nagababu | ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్లో ఆయనకు చోటు లభించింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగబాబుకు సినిమాటోగ్రఫీ (Cinematography) శాఖను కూటమి ప్రభుత్వం అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం జనసేన పార్టీ నేత కందుల దుర్గేశ్ ఈ శాఖను నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు టూరిజం శాఖ కూడా దుర్గేశ్ వద్దే ఉంది. అయితే, దుర్గేశ్ నుంచి సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. దుర్గేశ్ సొంత పార్టీ నేతే కావడంతో ఆయన నుంచి ఈ శాఖను నాగబాబుకు బదిలీ చేయడం సులభతరం అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక చిత్రపరిశ్రమకు చెందిన నాగబాబుకు ఈశాఖ కేటాయించడం వల్ల ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో గనుల శాఖ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అంశంపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Delhi | ఢిల్లీలో 4.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అధ్వానంగానే గాలి నాణ్యత
Arvind Kejriwal | అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆస్కారం లేదు.. ఒంటరిగానే పోటీ : కేజ్రీవాల్
Ajith Kumar | నన్ను అలా పిలవకండి.. అభిమానులకు అజిత్ విజ్ఞప్తి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

