Minister Nadendla | కాకినాడలో రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ : మంత్రి నాదెండ్ల
Minister Nadendla | కాకినాడలో రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అమరావతి : కాకినాడలో రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ (CID Enquiry) కోరతామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ( Minister Nadendla Manohar) తెలిపారు. పౌరసరఫరాల శాఖపై కాకినాడలో రెండో రోజు నిర్వహించిన సమీక్షను నిర్వహించారు. రేషన్ మాఫియా(Raion Mafia) కు కాకినాడ అడ్డాగా మారిందని ఆరోపించారు.
అశోక ఇంటర్నేషనల్ హెచ్ 1 గోదాంను తనిఖీ చేసి నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. నాణ్యత లేని 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ (Seize) చేయాలని అధికారులను ఆదేశించారు. గోదాంలోని నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాకినాడ పోర్టును వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి (Former MLA Dwarampudi) కుటుంబం ఆక్రమించి అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తుందని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాల తనిఖీ కోసం బృందాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తనిఖీలు పూర్తయ్యేవరకు బియ్యం ఎగుమతులు ఆపేస్తామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

