క్వాష్‌పై మా వాదనలూ వినాలి
టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని ఏపీ సీఐడీ కేవియట్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్‌పై బుధవారం ఒకేరోజు రెండు బెంచ్‌ల వద్ద విచారణ జరిగిన తరువాత కేసు అక్టోబర్ 3కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
- బాబు కేసులో సుప్రీంకోర్టుకు సీఐడీ వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్నది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని ఏపీ సీఐడీ కేవియట్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్‌పై బుధవారం ఒకేరోజు రెండు బెంచ్‌ల వద్ద విచారణ జరిగిన తరువాత కేసు అక్టోబర్ 3కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే ఇవ్వాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను సస్పెండ్ చేయాలని, ప్రస్తుత విచారణ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నారు. ఈ కేసులో తమ వాదన కూడా వినాలంటూ సీఐడీ కేవియట్ దాఖలు చేయడంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 3న ఏ బెంచ్‌లో విచారణ జరుగాలో లిస్టు కావాల్సి ఉంది. ఆ తరువాత ఉభయ పక్షాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఆ తరువాత అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ సీఐడీ చీఫ్‌పై టీడీపీ ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తేతెలంగాణ):ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడని ఆరోపిస్తూ టీడీపీ ఎంపీ కే రామ్మోహన్నాయడు గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించి పనిచేస్తున్నారని, విచారణ జరపకుండానే చంద్రబాబుపై ఆరోపణలు చేశారని తెలిపారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను బహిరంగంగా మీడియాకు చెబుతున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యంతో జీపీ సిబ్బందికి ఆర్ధిక భద్రత’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

