తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం దృష్టి.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా...
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితోపాటు ఇద్దరు సభ్యులుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుంటారు. ఈ కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17 న కమిటీ తొలి సమావేశం జరగనున్నది.
త్రి సభ్య కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ గతంలో ప్రకటన చేసిన కేంద్రం.. ప్రస్తుతం హోంశాఖ ఎజెండాలో ప్రత్యేక హోదా విషయాన్ని చేర్చినట్లుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చించేందుకే త్రి సభ్య కమిటీ అంటూ పేర్కొన్న హోంశాఖ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా.. కేంద్రం చెవికి ఎక్కడం లేదు.
ఈ కమిటీ సమావేశంలో ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతోపాటు ఏపీఎస్ఎఫ్సీ విభజన, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యలు, పన్నుల వ్యవహారం, వనరు వ్యత్యాసాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సమస్యలపై ఎజెండాలో మచ్చుకైనా కనిపించకపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణపై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కేందుకు కేంద్రం కుట్రపన్నుతున్నట్లుగా అర్ధమవుతున్నది. ఈ నెల 17 నాటి తొలి సమావేశంలో చర్చించే అంశాల ఆధారంగా తర్వాతి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయనేది తేలుతుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

