ఏపీలో టీడీపీ సీనియర్ నేతపై కేసు నమోదు..
ap tdp leader| టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్
అమరావతి: టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వివరించారు. పోలీసులు నమ్మకపోవడంతో చాలా సేపు అయ్యన్నపాత్రుడి ఇంట్లోనే ఉండి చివరకు ఇంటికి నోటీసులు అంటించిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడిపై 153 ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ..అయ్యన్న పాత్రుడు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడుతున్నారని, బూతులు మాట్లాడే వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అయ్యన్నపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

