AP Speaker | అనాలోచిత పాలన వల్ల శిథిలావస్థకు అమరావతి రాజధాని : ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
AP Speaker | ఓ నాయకుడు అనాలోచిత పాలన వల్ల అమరావతి రాజధాని శిథిలావస్థకు చేరిందని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
అమరావతి : ఓ నాయకుడు అనాలోచిత పాలన వల్ల అమరావతి రాజధాని శిథిలావస్థకు చేరిందని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) ఆరోపించారు. శుక్రవారం రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. అసంపూర్తిగా ఉన్న మీడియా, గ్రంథాలయం, డైనింగ్ హాళ్లను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే(MLA), ఎమ్మెల్సీ క్వార్టర్ల(MLC Quarters) ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయించలేక పోయిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా నిర్మించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల భవన సామగ్రిని దొంగిలించారని ఆరోపించారు.
ఐదేండ్ల పాటు పనులు చేపట్టకపోవడంతో తిరిగి పనుల పూర్తికి అధనంగా మరో 3వందల కోట్ల ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను సీఎం దృష్టికి తీసుకెళ్లి 9 నెలల్లో్ క్వార్టర్లను సభ్యులకు అందజేసే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అందరం కలిసి రాజధానిని నిర్మించుకుని ప్రజలకు అంకితమివ్వాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

