సముద్రంలో తిరగబడిన బోటు.. ఓ మత్స్యకారుడు మృతి
అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా : వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నది. చేపల వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు. అయినా వారి సూచనలు పెడచెవిన పెట్టి పలువురు చేపల వేటకు వెళ్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అంబేడ్కర్కోనసీమ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో తిరగబడటంతో ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. బోటులోని మిగతా నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన అల్లవరం మండలం ఓడలరేవు సాగర సంగమం వద్ద చోటుచేసుకుంది.
ఓడలరేవులోని జెట్టి నుంచి శనివార ఉదయం ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఓ బోటులో బయలుదేరారు. సముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే గాలి తీవ్రత కారణంగా సముద్ర అలలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బోటు తిరగబడింది. దాంతో బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. నలుగురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా, ఒక మత్స్యకారుడు అలల తాకిడి ఎక్కువై ఒడ్డుకు చేరలేక మృతి చెందారు.
బోటులో చేపల వేటకు వెళ్లినవారు కాకినాడకు చెందిన మత్స్యకారులుగా తెలిసింది. ఓడలరేవు సాగర సంగమం వద్ద తిరగబడిన బోటును స్థానిక మత్స్యకారులు కలిసి తీరానికి చేర్చారు. సముద్రం నుంచి ఈదుకుంటూ నలుగురు ఒడ్డుకు చేరడంతో అక్కడి వారు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఐదో వ్యక్తి మరణించడంతో విషాదం అలుముకున్నది. మత్స్యకారుడి మృతదేహం ఒడ్డుకు చేరిన తర్వాత ప్రైవేటు వాహనంలో స్థానిక మత్స్యకారులు వారి స్వగ్రామానికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

