Nara Lokesh Tweet | బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. కేంద్రానికి ప్రజల తరుఫున కృతజ్ఞతలు : నారా లోకేష్ ట్వీట్
Nara Lokesh Tweet | ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్రానికి ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి (Union Government) ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ (Nara Lokesh Tweet) ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో (Budget) రాజధాని అమరావతి(Amaravati) కి రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన ప్రకటించారు.
మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్న అదనపు నిధులను అమరావతికి కేటాయిస్తామని ఆమె వెల్లడించారు. విభజన చట్టానికి అనుగునంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం కూడా అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్లకు ప్రత్యేక సహాయం చేస్తామని నిర్మలాసీతారామన్ ప్రకటించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

