YS Sharmila | ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల
YS Sharmila | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు.
అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదాను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila) ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్రంలో బీజేపీ(BJP fraud ) ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ప్రత్యేక హోదాను వాడుకుంటున్నాయే తప్ప వాటి గురించి చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదా (Special Status) రాష్ట్రానికి గుండెకాయ లాంటిదని అన్నారు. ఓటు అనేది ఐదేళ్లకు ఒకసారి ప్రజల వద్దకు వచ్చే ఆయుధమని, ఈ కీలక ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీకి జగన్ గులాంగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, జగన్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని రావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లిక్కర్,భూ మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శించారు. BJP fraud by not giving special status: YS Sharmila
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

