YS Sharmila | ఆడబిడ్డ తల్లిగా తీవ్ర భయాందోళనకు గురయ్యా.. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఘటనపై షర్మిల ఆవేదన
YS Sharmila | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు.
YS Sharmila | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని తెలిపారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందని అన్నారు.
ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే… వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇదే సజీవ సాక్ష్యమని అన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్పణమని అన్నారు. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని షర్మిల అన్నారు. రాజకీయ నాయకుడి కొడుకా.. కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా.. ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనని అన్నారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే కాలేజీని సందర్శించి.. విద్యార్థినులతో మాట్లాడుతానని తెలిపారు. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ఇచ్చారు.
Read More :
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
రేపు ఈఎంసి పరిధిలో దీక్షా దివస్ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

