AP News | తెలుగు తమ్ముళ్లకు సారీ చెప్పిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి!
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో కలిసి పార్థసారథి పాల్గొన్నారు.
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో కలిసి పార్థసారథి పాల్గొన్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా మంత్రి చేష్టలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కంగారు పడిపోయిన కొలుసు పార్థసారథి ఇప్పటికే చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు శాంతించకపోవడంతో తాజాగా అమరావతిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ వారికి సారీ చెప్పారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పటికీ మరిచిపోనని మంత్రి పార్థసారథి తెలిపారు. గౌడ సామాజిక వర్గం వాళ్లు డిజైన్ చేసిన ప్రొగ్రామ్‌కు తాను వెళ్లానని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అక్కడ సడెన్‌గా జోగి రమేశ్‌ను చూసి షాకయ్యానని పేర్కొన్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చొరబడటం వైసీపీ నేతలకు ముందు నుంచి అలవాటేనని చెప్పారు. జోగి రమేశ్‌కు చిల్లర చేష్టలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.
వైసీపీ తానులో నుంచి చించుకుని బయటకు వచ్చేశానని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. తాను టీడీపీ సిద్ధాంతాలను బలంగా నమ్ముతానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు తనను ఆదరించారని.. నూజివీడులో తమ భుజం మీద వేసుకుని మరీ తనను గెలిపించారని చెప్పారు. టీడీపీ సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని కాదని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా జోగి రమేశ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. జోగి రమేశ్ ఎపిసోడ్లో పార్టీ హైకమాండ్, కార్యకర్తలకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

