ముచ్చుమర్రి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన హోం మంత్రి
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. కాగా, ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం ఇంకా దొరకలేదని తెలిపారు. డెడ్‌బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెతుకుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించారు. ముచ్చుమర్రి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలంలో ఆరు నెలల చిన్నారిపై అత్యాచార ఘటనపై వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత చిన్నారి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించారు. ఈ డబ్బును బాధిత చిన్నారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఈ రెండు కేసుల్లో బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఈ ఘటనలపై స్పెషల్ కోర్టు ఏర్పాటుకు సీఎం ఆదేశించారని చెప్పారు. తప్పు చేసింది ఎవరైనా సరే వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు. ఆరు నెలల వయసున్న తన చిన్న కూతుర్ని ఊయలలో పడుకోబెట్టి.. ఆమె దగ్గరలోని కిరాణ దుకాణానికి వెళ్లింది. ఇది గమనించిన నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర ఇంట్లోకి వెళ్లి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ పాప గట్టిగా ఏడ్చింది. ఇది విన్న చిన్నారి వాళ్ల అక్క అక్కడకు వెళ్లి ఆ దారుణాన్ని చూసింది.
వెంటనే కిరాణానికి వెళ్లిన తల్లి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దీంతో తల్లితో పాటు స్థానికులు అందరూ ఆగ్రహంతో వెళ్లారు. అది గమనినంచిన ఎరకన్న దొర అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం రక్తస్రావమైన చిన్నారిని బాడంగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా గ్రామానికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం నార్లవలసకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

