Pinnelli | పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు
Pinnelli | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Pinnelli | మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. పాల్వాయి గేటు, కారంపూడి కేసుల్లో ఏపీ హైకోర్టు పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఈ కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుల్లో దిగువ కోర్టులో రెండు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించే ఏ షరతులకు కట్టుబడి ఉంటానని తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

