AP Minister Parthasarathy | తుగ్లక్ నిర్ణయాలతో ఏపీకి రాజధాని లేకుండా పోయింది : ఏపీ మంత్రి పార్థసారథి
AP Minister Parthasarathy | వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు.
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాలనపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (AP Minister Parthasarathy) తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలతో (Tughlaq decisions) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు.
వైసీపీ అసంబద్ద నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని వివరిస్తూ విమర్శలు చేశారు. రాజధాని అమరావతిని ( Amaravati ) కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అంతర్జాతీయస్థాయిలో తెలుగు ప్రజలు గర్వపడే విధంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందన్నారు. దాంట్లో భాగంగానే ప్రపంచబ్యాంక్ (World Bank) , హడ్కో, కేడబ్ల్యూఎఫ్ నిధులతో రూ. 33,137 కోట్లతో 45 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు ఏపీసీఆర్డీఏకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు.
గత జగన్ రెడ్డి ప్రభుత్వం, స్వచ్ఛమైన త్రాగు నీటి కోసం, కేంద్రం అందించిన జల్ జీవన్ మిషన్ (Jal jeevan Misson) ని నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. నాడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష నుంచి లక్షన్నర కోట్లు ఈ పథకం కింద నిధులు కేంద్రం నుంచి తీసుకోగా జగన్ సర్కార్ కేవలం రూ. 27 వేలు కోట్లు మాత్రమే తీసుకుని వాటిలో కేవలం రూ. 4వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని వెల్లడించారు.
475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
475 జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించే పథకానికి ఆమోదం తెలిపినట్టు వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1.41 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుందని తెలిపారు. క్లీన్ ఎనర్జీ కోసం ఎన్టీపీసీ ద్వారా పెట్టే పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుదుత్పత్తి యూనిట్ల స్థాపనకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

