AP News | ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐదు రోజుల పనిదినాలు పొడిగింపు
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
AP News | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సదుపాయాలు కల్పించారు. రాజధానిలో క్వార్టర్స్‌తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. వీకెండ్లో హైదరాబాద్‌కు వచ్చి తమ కుటుంబాలతో గడిపేవారు.
అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే దాకా సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ వాళ్లు అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీంతో ఈ వెసులుబాటును ఎత్తివేయాలని జగన్ అనుకున్నారు. కానీ సచివాలయ ఉద్యోగుల ఒత్తిడితో ఈ వెసులుబాటును కొనసాగించక తప్పలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతిపై ఫోకస్ పెట్టారు. వీలైనంత తొందరగా రాజధానిని పూర్తిచేసే పనిలో పడ్డారు. కాగా, సచివాలయ ఉద్యోగులకు కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు తొందరలోనే ముగుస్తుంది. దీంతో ఈ వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

