ఏపీ వైద్యారోగ్య శాఖలో 2588 పోస్టుల భర్తీకి నిర్ణయం
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది...
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో నియామకాలు చేపడుతున్నది. వీటికి తోడుగా ఏపీ వైద్య విధాన మండలిలో మరో 2,588 పోస్టులను సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, హెల్త్ కమిషనర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం పోస్టులు సృష్టించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొత్తగా సృష్టించిన పోస్టుల్లో డాక్టర్లు 485, నర్సింగ్ 60, ఫార్మసీ 78, పారామెడికల్ క్లాస్-4 644, ల్యాబ్ టెక్నీషియన్ 279, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 39, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 54, ఇతర పోస్టులు 949 ఉన్నాయి. వీటిలో చాలా పోస్టులు డైరెక్ట్, పర్మినెంట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. మరికొన్ని పోస్టులను పదోన్నతితో భర్తీ చేయనున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య, ఆరోగ్య శాఖల్లో ఇప్పటివరకు 39 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. 27 వేల పోస్టుల్లో నియామకాలు పూర్తవగా.. మిగిలినవి ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో 2,588 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేయడం విశేషం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

