AP DSC | మెగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్!
AP DSC | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టెట్‌కు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది.
AP DSC | ఏపీలో టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టెట్‌కు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది.
టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని విద్యార్థి, యువజన సంఘాలు ముందు నుంచి సమయం అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సంఘాల నేతలు ఇటీవల మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన నారా లోకేశ్.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణలోకి తీసుకుని.. టెట్, మెగా డీఎస్సీ ప్రిపరేషన్‌కు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టెట్‌కు 90 రోజులు, డీఎస్సీకి 90 రోజుల సమయం ఇస్తూ.. మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది. కాగా, కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించనున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం 6100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. అయితే రద్దయిన డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారికి మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. వారి నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా, ఎలాంటి విమర్శలు తావులేకుండా మెగా డీఎస్సీని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP DSC
- AP DSC 2024
- AP News
- AP TET
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

