Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. నంబర్ ప్లేట్లపై పవన్ కల్యాణ్ ఫన్నీ కామెంట్స్
Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్‌గా మారిన ప్రచారం ఇదీ.. పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్ నంబర్ ప్లేట్లపై ఇలా రాయించుకుని తిరిగారు.. ఈ ట్రెండ్‌పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan | పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా.. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగ వైరల్‌గా మారిన ప్రచారం ఇదీ.. పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని ఫిక్సయిపోయిన జన సైనికులు పోటీపడి మరీ తమ బైక్ నంబర్ ప్లేట్లపై ఇలా రాయించుకుని తిరిగారు.. ఈ ట్రెండ్‌పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ బుధవారం నిర్వహించిన వారాహి బహిరంగసభలో ప్రసంగించారు. అందులో ‘ ఎమ్మెల్యే గారి తాలుకా ‘ అని నంబర్ ప్లేట్లపై రాసుకోవడంపై స్పందించారు. దయచేసి ఎవరూ నంబర్ ప్లేట్లపై అలా రాసుకోవద్దని సూచించారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అని చెప్పి చెడ్డపేరు తీసుకురాకండి అని కోరారు. వాహనానికి ఒరిజినల్ నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పోలీసులు పట్టుకుంటారని.. అప్పుడు ఎమ్మెల్యే గారి తాలుకా అనిచెబితే వారు నన్ను తిడతారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అందరూ చట్టాలు పాటించాలని హితవు పలికారు.
యువత రోడ్లపై వేగంగా బైక్‌లు నడపవద్దని.. ఒకవేళ ఎవరికైనా రేసులు పెట్టుకోవాలని ఉంటే తన రెండెకరాల స్థలాన్ని వినియోగించుకోవచ్చని పవన్ కల్యాణ్ సూచించారు. తన రెండెకరాల పొలంలో మడ్ రేసు పెడతానని.. అక్కడికి వచ్చి రైడ్ చేసుకోండి అని సలహా ఇచ్చారు. బైక్ రేసు కోసం వచ్చే వాళ్లకు హెల్మెట్లు, సేఫ్ గార్డులు, ఇతర రక్షణ పరికరాలు కూడా అందుబాటులో ఉంచుతానని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

