YS Jagan | 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు.. టీడీపీ అధినేతపై ఏపీ సీఎం జగన్ ఫైర్
YS Jagan | తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు.
YS Jagan | ఎన్నికల వేళ పెన్షన్లు పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ కుట్రలపై ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. నాయుడుపేటలో గురువారం నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు అందించామని.. కానీ దాన్ని జీర్ణించుకోలేక.. అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారని జగన్ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌తో ఈసీకీ ఫిర్యాదు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. వెయ్యి ఇస్తున్న పెన్షన్‌ను రూ.3వేలకు పెంచామని గుర్తుచేశారు. పేదలకు వైసీపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు చెడిపోయాయని.. దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెబితేనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని అన్నారు. 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఓపిక పట్టండి.. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే చేస్తానని హామీ ఇచ్చారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సేవలందిస్తానని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని.. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలే అని విమర్శించారు. చంద్రబాబుకు నా అనే వాళ్లంతా నాన్ లోకల్స్ అని పేర్కొన్నారు. ఏపీలో పేద ప్రజలంతా తన వాళ్లే అని చెప్పారు. రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల ముఠా దోచుకుందని విమర్శించారు. మనకు కుట్రలు, పొత్తులు, జిత్తులతో పనిలేదని అన్నారు.
చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో పోటీ పడాలని తాను అనుకోవడం లేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబులా మోసపు వాగ్దానాలు చేయనని అన్నారు. మీ జగన్ అబద్ధాలు చెప్పడు.. మోసాలు చేయడని అన్నారు. సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టనని చెప్పారు. మేనిఫెస్టోలో లేనివి కూడా చాలా అమలు చేశామని అన్నారు. తనకు పేద ప్రజలపై ఉన్న ప్రేమ.. దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడికి లేదని తెలిపారు. తాను చేయలేని ఏ పథకమైనా చంద్రబాబు జేజమ్మ కూడా అమలు చేయలేరని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

