గౌతంరెడ్డి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా : ఏపీ సీఎం జగన్
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గౌతం రెడ్డి మన మధ్య లేరన్న విషయాన్ని ఇంకా తాను నమ్మడమే లేదన్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో గౌతంరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోడానికి ఇంకా సమయం పడుతుందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

గౌతం రెడ్డి తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. 2009-2010 మధ్య తాను కాంగ్రెస్ నుంచి విడివడినప్పటి నుంచీ గౌతం తనకు అండగా నిలుస్తూనే వున్నారని, ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ, గౌతంరెడ్డి తండ్రి రామ్మోహన్ రెడ్డి కూడా గౌతం రెడ్డి వల్లే తనకు మద్దతిచ్చారని జగన్ వ్యాఖ్యానించారు.
ప్రతి పనీలోనూ గౌతం రెడ్డి తనను ప్రోత్సహించేవారని, తనను కూడా ప్రేరేపించేవారని సీఎం జగన్ పేర్కొన్నారు. గౌతం రెడ్డిని తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, ఆ తర్వాత మంచి రాజకీయ నేతగా ఎదిగారని తెలిపారు. ఓ మంచి మంత్రిగా తన కేబినెట్లో కొనసాగారని, దాదాపు 6 శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఏపీకి పరిశ్రమలను తీసుకురావడంలో గౌతం రెడ్డి చాలా కష్టపడ్డారని, ఎంతో తాపత్రయపడేవారని అన్నారు. గౌతంరెడ్డి కుటుంబానికి తనతో సహా, వైసీపీ మొత్తం తోడుగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

