ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం 5.03 గంటలకు బయలుదేరారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 5.27 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అయితే, విమానం ఏసీ వాల్వ్‌లో లీకేజీ కారణంగా ప్రైజరేజేషన్ సమస్య తలెత్తినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ఆయన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. ఢిల్లీకి బయలుదేరారు. విమానంలో సాంకేతిక లోపం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకొని తాడేపల్లి గూడెంలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు. జగన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

