అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.మాజీ సీఎం చంద్రబాబు దగ్గర సీఎస్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించిన ఆయన యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు రావడంతో అతడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ఆచరణలో అవకతవకలు జరిగాయని గత సెప్టెంబర్‌లో సీఐడీకి ఫిర్యాదు చేశామని ప్రసుత్త స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ అజయ్‌రెడ్డి పేర్కొన్నారు. ఒప్పంద సమయంలో లక్ష్మీనారాయణ కార్పొరేషన్‌కు సలహాదారుగా పనిచేశారని వివరించారు. ఒప్పందంపై లోతైన విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగు చేస్తాయని సీఐడీ అధికారులువెల్లడించారు .