ఎంపీ రఘురామ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ హైకోర్టు విచారణ
ఎంపీ రఘురామ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏపీ విచారణ | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మరికాసేట్లో విచారణ జరుపనుంది.

అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ఎంపీ రఘురా మకృష్ణరాజు అరెస్టుపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మరికాసేట్లో విచారణ జరుపనుంది. రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో విచారణ పూర్తయ్యేంత వరకు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని సీఐడీ అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల కస్టడీలో ఉన్న రఘురామకు ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. రాత్రి నుంచి గుంటూర్సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గుంటూర్ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోనే అధికారులు మరోసారి ఆయనను విచారిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారని ఆయనపై రాజద్రోహం (124ఏ) కింద కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీపై అభియోగాలను మోపారు. ఎంపీతోపాటు రెండు టీవీ ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

