Andhra Pradesh | నెల రోజులకు రూ. కోటి కరెంట్ బిల్.. షాకైన బంగారం దుకాణం యజమాని
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
Andhra Pradesh | అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు పట్టణంలో జీ అశోక్ అనే వ్యక్తి ఓ బంగారం దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అంటే నెల రోజులకు గానూ రూ. 1,01,56,116 కరెంట్ బిల్లు విధించారు విద్యుత్ అధికారులు. రూ. కోటి కరెంట్ బిల్లును చూసిన అశోక్ షాకయ్యాడు. విద్యుత్ అధికారుల నిర్వాకంపై ఆయన మండిపడ్డాడు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తనకు ప్రతి నెల రూ. 7 వేల నుంచి రూ. 8 వేల మధ్య కరెంట్ బిల్ వచ్చేది. కానీ ఈ నెల మాత్రం రూ. కోటి వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి, మళ్లీ కొత్తగా కరెంట్ బిల్లు జారీ చేస్తామన్నారు విద్యుత్ అధికారులు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

