Amaravati – World Bank | ఎకనమిక్ హబ్‌గా ఏపీ రాజధాని.. అమరావతి అభివృద్ధికి 800 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు రుణం..!
Amaravati - World Bank | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర అభివృద్ధికి రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది.
Amaravati – World Bank | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నగర అభివృద్ధికి రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. అలాగే అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసినట్లు గురువారం ప్రపంచ బ్యాంకు వర్గాలు తెలిపాయి. గురువారం జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ‘అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్’ కింద 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పర్యావరణ హిత అభివృద్ధి కేంద్రంగా అమరావతిని రూపుదిద్దుతారు. ప్రస్తుత, భవిష్యత్ పౌరుల స్థితిగతులు మెరుగు పర్చడంతోపాటు ఉపాధి కల్పనకు ఈ రుణం వినియోగిస్తారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎకనమిక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రుణం మంజూరు చేయాలని భారత ప్రభుత్వం కోరిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అత్యంత అవసరమైన వారితోపాటు పౌరులందరి జీవన స్థితిగతులు మెరుగు పర్చి, ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా అమరావతిని మోడర్న్ సిటీగా రూపుదిద్దాలని భారత్ కోరిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. 29 ఏండ్లలో ఈ రుణం చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా ఆరేండ్లు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ENE Repeat | మరింత ఫన్‌తో.. తరుణ్ భాస్కర్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

