అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభం
Amaravati Capital| అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన రైతుల దీక్ష వెయ్యిరోజులు గడిచిన సందర్భంగా మలివిడత మహాపాదయాత్ర ఇవాళ
అమరావతి : అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ చేపట్టిన రైతుల దీక్ష వెయ్యిరోజులు గడిచిన సందర్భంగా మలివిడత మహాపాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతి నుంచి అరసపల్లి వరకు నిర్వహించనున్న పాదయాత్ర ప్రారంభం సందర్భంగా వెంకటపాలెం శివారు టీటీడీ దేవాలయంలో రైతులు పూజలు నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు.
కాగా పాదయాత్రలో వేంకటేశ్వరస్వామి రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . వైసీపీ కార్యకర్తలు సైతం పాదయాత్రకు మద్దతు తెలపడం విశేషం. వారి ఆధ్వర్యంలోనే రథం నడిపే బాధ్యతను రైతులు అప్పగించారు. కొద్ది దూరం ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, సీపీఐ నాయకుడు నారాయణ, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ రథాన్ని నడిపి రైతులను ఉత్సాహపరిచారు.
రెండు నెలలపాటు సుమారు 900 కిలోమీటర్ల వరకు కొనసాగే పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు మద్దతు పలికాయి. . రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రాష్ట్రప్రజలను చైతన్య పరిచేందుకు పాదయాత్రనునిర్వహిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

