Srisailam | ఇక శ్రీశైలంలో ఆన్లైన్లోనే అన్ని రకాల సేవా టికెట్ల బుకింగ్ !
Srisailam | సోమవారం నుంచి ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు శ్రీశైలం ఈఓ లవన్న సూచించారు.
Srisailam | సోమవారం నుంచి శ్రీశైలం శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు ఇవ్వడం లేదని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లను ఏప్రిల్ 25వ తేదీనే ఆన్ లైన్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఇప్పటికే భక్తులు.. దేవస్థానం వెబ్సైట్ `www.srisailadevasthanam.org`ద్వారా ముందస్తుగా టికెట్లు పొందారు.
అయితే, రూ.150 రుసుముతో శీఘ్ర దర్శనం, రూ.300లతో అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌తోపాటు కరెంట్ బుకింగ్ ద్వారా పొందొచ్చు. ఈ టికెట్లలో 30 శాతం ఆన్ లైన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించగా, మిగతా 70 శాతం టికెట్లు కరంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు.
యధావిధిగా ఉచిత దర్శనం
ఇక వారంలో నాలుగు రోజులు.. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచితంగా శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది. ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు విధిగా ఆన్ లైన్ లో పొందిన టికెట్ ప్రింట్ కాపీ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా పొందిన ఆ టికెట్లు స్కాన్ చేశాక మాత్రమే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని ఈవో లవన్న తెలిపారు.
ఆర్జిత సేవకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు గల వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు (ఒరిజినల్ లేదా జిరాక్స్) వెంట తెచ్చుకోవాలి. ఆధార్ కార్డును అనుసరించే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారిని అనుమతిస్తారు.
ఇక సర్ప దోష నివారణ పూజ, అక్షరాభ్యాసం, అన్న ప్రాశన టికెట్లు కరంట్ బుకింగ్ ద్వారా కూడా ఇస్తారు. సామాన్య భక్తులకు సర్వ దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఆర్జిత సేవలు విడతల వారీగా నిర్వహిస్తారు. శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం కూడా నిర్దిష్ట వేళలోనే అనుమతి ఇస్తారు. కనుక ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందిన ఆర్జిత సేవాకర్తలు.. టికెట్లపై సూచించిన సమయంలో మాత్రమే ఆయా ఆర్జిత సేవలు జరిపిస్తారు. సేవాకర్తలు వారి టికెట్లపై సూచించిన సమయం కంటే కనీసం 15 నిమిషాలు ముందు ఆర్జిత సేవా క్యూ లైన్ ప్రవేశ ద్వారం వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, స్పర్శ దర్శనం టికెట్ పొందిన భక్తులకు కూడా టికెట్ మీద పేర్కొన్న సమయంలో మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తారు.
ప్రొటోకాల్ దర్శనంలో మార్పులు
శ్రీశైల శ్రీ భమరాంబికా శ్రీ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే ప్రముఖులు కనీసం రెండు రోజుల ముందు వారి పర్యటన వివరాలు తెలియజేయాలని ఈవో లవన్న తెలిపారు. అలాగే వసతి ఏర్పాట్లకు సంబంధించిన సిఫారసు విషయమై ప్రముఖులంతా తమ లెటర్ హెడ్ పై కనీసం రెండు రోజుల ముందు సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఈ లేఖలను protocol@srisailadevasthanam.org మెయిల్ ఐడీకి పంపాలి. అలాగే ప్రొటోకాల్ ఫోన్ నంబర్ 9160016215 కు కూడా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
ప్రస్తుతం ప్రభుత్వ సెలవు దినాలు, పర్వదినాల్లోనే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అందుకే భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యవంతంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు, ఆర్జిత సేవలు జరిపించుకునేందుకు ఈ మార్పులు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. కనుక భక్తులంతా దేవస్థానం అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

