Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. స్పర్శ దర్శనంలో మార్పులు చేసిన దేవస్థానం..
Srisailam | భక్తులకు శ్రీశైలం దేవస్థానం అలర్ట్ ప్రకటించింది. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. రద్దీ రోజుల్లో స్పర్శ దర్శనంలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీశైలమహాక్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతోనూ, సర్వ దర్శనం క్యూలైన్లోని సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రద్దీ రోజుల్లో స్వామి వారి స్పర్శ దర్శన ఏర్పాటు విషయంలో మార్పులు చేసినట్లు తెలిపింది.
ఇక మీదట రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో కేవలం రెండు సార్లు మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించినట్లు వెల్లడించింది. రద్దీ రోజుల్లో ఉదయం 7.30 గంటలకు, రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర సమయమంతా కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని తెలిపారు. గతంలో అమలులో ఉన్న మధ్యాహ్న కాలపు స్పర్శ దర్శనం రద్దీ రోజుల్లో పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు ఈ స్పర్శదర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు. ఒక్కొక్క విడతలో కేవలం 500 టికెట్లు మాత్రమే జారీ చేస్తామని వెల్లడించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజులలో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో రూ.1,000 సేవా రుసుముతో ఆర్జిత కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. కనుక భక్తులు ఈ మార్పులు గమనించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

