సంగం డెయిరీలో తనిఖీకి ఏసీబీ యత్నం.. అడ్డుకున్న డెయిరీ అధికారులు
సంగం డెయిరీలో తనిఖీకి ఏసీబీ యత్నం | గుంటూర్ జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం మరోసారి తనిఖీలకు యత్నించారు. సర్వర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా డెయిరీ అధికారులు అభ్యంతరం తెలిపారు.

అమరావతి : గుంటూర్ జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం మరోసారి తనిఖీలకు యత్నించారు. సర్వర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా డెయిరీ అధికారులు అభ్యంతరం తెలిపారు.
నిన్న కూడా అధికారులు డెయిరీలో తనిఖీలకు వెళ్లి కంప్యూటర్లను, సర్వర్లను పరిశీలించేందుకు యత్నించగా యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్కెటింగ్ డేటా ఉండే సర్వర్లను బయట వ్యక్తులు తనిఖీ చేయడంపై నిరసన వ్యక్తం చేసింది.
తనిఖీలకు బయటి వారు వచ్చారని ఆరోపించింది. ఇదిలాఉండగా సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీ)కి అప్పగించాలని కోరుతూ ఏప్రిల్ 27 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
దీంతో సంగం డెయిరీ సంస్థలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర ఇతర డైరెక్టర్లకు ఊరట లభించినట్లయ్యింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

