రైల్వే స్టేషన్లో విద్యార్థినికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
చివరకు ఆమెను స్వల్పగాయాలతో బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
అమరావతి : రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా గాని అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
అన్నవరానికి చెందిన విద్యార్థిని శశికళ రోజుమాదిరిగానే దువ్వాడలోని ఓ కళాశాలలో చదువుకునేందుకు రైలులో రాకపోకలు కొనసాగిస్తుంది. బుధవారం గుంటూరు -రాయగఢ ఎక్స్‌ప్రెస్ దిగుతున్న ఆమె రైలుకు-ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
రైలు కదిలితే విద్యార్థినికి ప్రమాదం జరిగే అవకాశముండడంతో ఆమెను సురక్షితంగా కాపాడేందుకు రైల్వే సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గంట పాటు శ్రమించారు. ఈ సమయంలో ఆమె తీవ్రంగా ఇబ్బందులకు గురైంది. చివరకు ఆమెను స్వల్పగాయాలతో బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

