Tirupati | గోవిందరాజస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati | తిరుపతి గోవిందరాజస్వామి వారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
తిరుపతి : తిరుపతి (Tirupati ) గోవిందరాజస్వామి (Govindarajaswamy,) వారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు తీసుకు వచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం నిర్వహించారు. మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ మఠం ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్‌రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

