Electric bike showroom | ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఎగసిపడ్డ మంటలు.. 90 బైక్‌లు దగ్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లకు చార్జింగ్ పెట్టారు.
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాశీబుగ్గలోని (Kasibugga) ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో (Electric bike showroom) మంటలు చెలరేగడంతో 90 వాహనాలు దగ్ధమయ్యాయి. షోరూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్‌లకు చార్జింగ్ పెట్టారు. అయితే ఓ బైక్ బ్యాటరీ పేలిపోవడంతో షోరూంలో ఒక్కసారిగా మంటలు (Fire accident) అంటుకున్నాయి. క్రమంగా అవికాస్తా పెద్దవికావడంతో షారూం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
ఈ క్రమంలో పక్కనే ఉన్న హార్డ్‌వేర్ షాప్, వైన్ షాప్‌లకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా భారీగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. షోరూంలో ఉన్న 90 బైకులు అగ్నికి ఆహుతయ్యాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

