శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1189 మంది క్షురకులు
Brahmotsavam| శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు సత్వర సేవలు అందిం చేందుకు టీటీడీ ఏర్పాట్లు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా మొత్తం 1189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉండడం విశేషం. రెండేళ్ల తరువాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనుండడంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశముందని టీటీడీ అంచనా వేస్తోంది.
ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. మొత్తం రెగ్యులర్ క్షురకులు 337 మంది కాగా వీరిలో 336 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మొత్తం పీస్ రేటు క్షురకులు 852 మంది కాగా వీరిలో 639 మంది పురుషులు, 213 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1189 మంది క్షురకులు, ముగ్గురు సూపరింటెండెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ లు, 20 మంది రెగ్యులర్ మేస్త్రీలు, 46 మంది సహాయక సిబ్బంది మూడు షిఫ్టుల ద్వారా విధులు నిర్వహి స్తున్నారని అధికారులు వెల్లడించారు.
కల్యాణకట్టలో సోలార్ వాటర్ హీటర్‌తో వేడినీటి సౌకర్యం, యాత్రికులు స్నానం చేయడానికి స్నానపు గదులు అందుబాటులో ఉంచుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

