Andhra Pradesh – Diwali | ఆంధ్రప్రదేశ్‌లో విషాదం.. ఉల్లిగడ్డ బాంబు పేలి ఒకరి మృతి..!
Andhra Pradesh - Diwali | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి దీపావళి పటాకులు విక్రయించడానికి ‘ఉల్లిగడ్డ’ బాంబులతో మోటారు సైకిల్ పై వెళుతుండగా ఒక దేవాలయం వద్ద గుంతలో పడినప్పుడు ఆ ఉల్లిగడ్డ బాంబులు పేలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి మరణించగా, మరో ఐదారుగురు గాయ పడ్డారు.
Andhra Pradesh – Diwali | దీపావళి సందర్భంగా అందరూ సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించి పటాకులు కాలుస్తాం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి దీపావళి పటాకులు విక్రయించడానికి ‘ఉల్లిగడ్డ’ బాంబులతో మోటారు సైకిల్ పై వెళుతుండగా ఒక దేవాలయం వద్ద గుంతలో పడినప్పుడు ఆ ఉల్లిగడ్డ బాంబులు పేలిపోయాయి. దీంతో ఆ వ్యక్తి మరణించగా, మరో ఐదారుగురు గాయ పడ్డారు. ఈ ఉల్లిగడ్డ బాంబుల్లో ఐఈడీ వంటి పేలుడు పదార్థాలు వాడి ఉంటారని అనుమానాలు ఉన్నాయి.
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12.17 గంటలకు జరిగినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపుతోంది. గాయ పడిన ఆరుగురు వ్యక్తులు జిల్లా కేంద్ర దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుళ్లతో ఆ ప్రాంతం అంతా పొగ కమ్మేసింది. పేలుడుతో పరిసర ప్రాంతాలు భయానకంగా మారాయి.స్కూటర్ మీద ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళ్తున్న వ్యక్తిని సుధాకర్ అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

