Vegetable cultivation | కూరగాయల సాగులో మెలకువలు.. లాభాలు పొందేందుకు మార్గాలు
Vegetable cultivation | మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఏడాది పొడవునా కాయగూరలు పండించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలను...
Vegetable cultivation | కూరగాయల సాగులో చైనా తర్వాత మనం రెండో స్థానంలో ఉన్నాం. అయితే, ఉత్పదకతలో మాత్రం వెనకబడే ఉన్నాం. కూరగాయలు పండించేందుకు మన దేశంలో అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నా దిగుబడి మాత్రం తక్కువగా ఉండటం ఆలోచించదగిన విషయం. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఏడాది పొడవునా కాయగూరలు పండించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.
సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తుంటారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో ఎక్కువ దిగుబడి సాధించేందుకు వీలుంటుంది. కూరగాయలను జూలై నెలలో తొలకరి వర్షాలతో నాటుతారు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించేందుకు.. దరిమిలా ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు వీలు చిక్కుతుంది. ఖరీఫ్ సీజన్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మంచి లాభాలను అందిపుచ్చుకోవచ్చు.
నేలలు
సారవంతమైన తేలికపాటి నేలలు లేదా బాగా నీరు ఇంకే బరువైన గరప నేతలు కూరగాయల సాగుకు అనుకూలమైనవి. బీడు భూములు, మురుగు నీరు పోయేందుకు సదుపాయం లేని భూముల్లో కాయగూరల సాగు చేపట్టవద్దు.
పొలం తయారీ
పొలాన్ని మూడు, నాలుగు సార్లు బాగా దున్ని హెక్టారుకు 15-20 టన్నుల పశువుల ఎరువు వేసి కలియ దున్నాలి. పంట మార్పిడి చేయడం ద్వారా ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
నారుమళ్ల తయారీ
కొన్ని పంటలకు ముందుగానే నారుపోసి పొలంలో నాటుకోవాలి. టమాట, వంకాయ, పచ్చి మిరప వంటి పంటలకు నారు పోసే సమయంలో ఎత్తు నారుమడులు తయారు చేసుకోవాలి.
నారుకుళ్లు తెగులు నివారణకు గాను విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను 10 సెంమీ ఎడంలో వరుసల్లో 2 సెంమీ లోతులో విత్తుకోవాలి. తర్వాత పశువుల ఎరువుగానీ, మట్టి లేదా ఇసుకతోగాని కప్పివేయాలి. కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. 4-6 వారాల వయసు వచ్చిన తర్వాత వాటిని వేరే చోట నాటుకోవాలి.
నారు నాటే విధానం
నారును సాయంత్రం వేళల్లో నిర్ణీత దూరంలో నాటుకోవాలి. విత్తనాలైతే నిర్ణీత దూరంలో ఎకరానికి నిర్ణీత పరిణామంలో విత్తుకోవాలి. బెండ, సోరకాయ, చిక్కుడు వంటి పెద్ద గింజలను కొంచెం లోతుగా. ముల్లంగి వంటి చిన్న గింజలను కొంచెం పైపైన నాటుకోవాలి.
దిగుబడికి సూచనలు
భూసార పరీక్షలకు అనుగుణంగా పోషకాలను నిర్ణీత మోతాదులో అందించాలి.
నేలలో తగినంత తేమ ఉండేలా చూడాలి.
బిందు, తుంపర్ల సేద్యం చేపట్టాలి.
కితో విత్తనానికి ట్రైకోడెర్మావిరిడి 4 గ్రాముల చొప్పున కలపి విత్తనశుద్ధి చేయాలి.
విత్తనాల్లో మొలక శాతం 70 కంటే ఎక్కువగా ఉండేలా చూడాలి.
ప్రభుత్వ ఆమోదిత సంస్థల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.
సరైన పక్వ దశలో కాయలు కోసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

