Pomegranate farming | దానిమ్మ సాగు, సంరక్షణ విధానం
Pomegranate farming | దానిమ్మ.. అనేక పోషకాలు కలిగి ఉండే అద్భుతమైన పండు. దానిమ్మ తోలు, పూల నుంచి రంగులను తయారు చేస్తారు. దానిమ్మ సాగును చేపట్టిని అధిక దిగుబడిని సాధించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు...
Pomegranate farming | దానిమ్మ.. అనేక పోషకాలు కలిగి ఉండే అద్భుతమైన పండు. దానిమ్మ తోలు, పూల నుంచి రంగులను తయారు చేస్తారు. పువ్వులు, ఆకులను వివిధ ఔషదాల తయారీలో వాడతారు. దీనిలో మన అలసట తీర్చే గుణం ఎక్కువగా ఉంటుంది. దానిమ్మ సాగును ఎక్కువగా మహారాష్ట్ర రైతులు చేపడుతున్నారు. దానిమ్మ సాగును చేపట్టిని అధిక దిగుబడిని సాధించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉన్నది.
దానిమ్మ ఊష్ణ మండల పంట. చలికాలంలో చల్లగాను ఎండాకాలంలో వేడిగా ఉండే మెట్ట ప్రదేశాలలో బాగా దిగుబడి వస్తుంది. దానిమ్మ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. కాయలు పెరిగే దశలో, పండే దశలో పొడిగా లేదా వేడిగా వాతావరణం ఉండటం అవసరం. ఉష్ణోగ్రత తగినంతగా లేకపోతె కాయల్లో తీపి తగ్గిపోతుంది. వాతావరణంలో తేమ ఉన్న ప్రాంతాల్లో కాయల నాణ్యత దెబ్బ తింటుంది.
దానిమ్మను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మిగిత పండ్ల తోటలను సాగు చేయలేని భూముల్లో కూడా దానిమ్మ సాగు చేపట్టవచ్చు. సున్నం శాతం ఎక్కువగా ఉన్న భూముల్లోనూ.. అలాగే క్షారత ఎక్కువగా ఉన్న భూముల్లో దానిమ్మ పంటను సాగు చేసి అధిక దిగుబడులను సాధించవచ్చు. దానిమ్మ సాగుకు లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. దానిమ్మ మొక్కలు నాటుకోవడానికి జూన్- జూలై నెలలు అనుకూలంగా ఉంటాయి.
దానిమ్మ రకాలు
గణేష్, మృధుల, భగువ వంటి విత్తనాలు అధిక దిగుబడిని ఇచ్చే దానిమ్మ రకాలు. వీటితో పాటు మస్కట్, జావార్ సీడ్లెస్ జ్యోతి, జోధ్‌పూర్ రెడ్, అలసంద, డోల్కపేపర్ సెల్ మొదలైన రకాలను కూడా సాగు, దిగుబడికి అనుకూలమైనవి.
నీటి యాజమాన్యం
ఏడాదికి దాదాపుగా 20-30 తడుల వరకు సాగు నీరు అవసరం. ప్రతేకించి కాయలు కాసే సమయంలో క్రమం తప్పకుండా నీటి తడులు ఇవ్వాలి. చెట్టు మీద కాయలు ఉన్నప్పుడు పంటలో నీటి ఎద్దడి ఉన్నట్లయితే కాయల్లో పగుళ్ళు ఏర్పడుతాయి. నీటి ఎద్దడి లేనప్పుడు కూడా కాయల్లో పగుళ్ళు కనిపిస్తే బోరాన్ లీటర్ నీటికి 0.5 గ్రా: ల చొప్పున కలిపి పిచికారి చేయాలి.
నాటే విధానం
దానిమ్మను ఎక్కువగా కత్తిరింపుల ద్వార నేల అంట్లు, గాలి అంట్లు ద్వాకా నాటుతారు. పెన్ను సైజు కొమ్మలను 25-30 సెంటి మీటర్లు కత్తిరించి అంటు కట్టుకొని నాటుకోవాలి. మొక్కలు అంటుకట్టే ముందు సేరాడాక్స్-బీ హర్మోన్లో ముంచి అంటుకట్టు కుంటే వేర్లు బాగా ఏర్పడతాయి. అంటు కట్టుకున్న 90 రోజుల తర్వాత మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి.
నాటుటకు 60 ఘణ సెంటి మీటర్ల గుంతలు తవ్వుకొని మొక్కకు మొక్కకు 5 మీటర్ల దూరంతో నాటుకోవాలి. మొక్కలు నాటడానికి ముందు గుంతల్లో 15 కిలోల పశువుల ఎరువు 100గ్రా లిండెన్, 500 గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ నింపుకోవాలి.
కత్తిరింపు
కొమ్మల కత్తిరింపులు మొదటి దశలో చెట్టు మంచి ఆకారాన్ని సంతరించు కోవడానికి చేస్తారు. దానిమ్మకు చాల వరకు పొదలా పెరిగే స్వభావం ఉంటుంది. అందువల్ల కాండం మొదలు నుంచి అనేక కొమ్మలు వస్తాయి. కొమ్మలను అలాగే వదిలిపెడితే గాలి ఆడకుండా గుబురుగా పెరిగి కాండము తోలిచే పురుగు, ఇతర తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బలంగా ఉన్న 3-4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరించాలి. కత్తిరించిన బాగాలకు వెంటనే ఒక శాతం బోరోపేస్టు రాయాలి. కొమ్మలను కత్తిరించడం వలన గాలి వెలుతురు సోకి పంటలో దిగుబడి పెరుగుతుంది. విశ్రాంతి దశలో చివరి కొమ్మలను 10 ఇంచుల వరకు కత్తిరించాలి. దీనివల్ల కాయల సైజు పెరుగుతుంది.
నాణ్యత
దానిమ్మ కాయల రంగు నాణ్యత పెంచడానికి కాయలు పక్వానికి వచ్చే దశలో లీటర్ నీటికి 2 గ్రాముల పొటాషియం డై హైడ్రోజన్ అర్ధోపాస్పేట్ కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా లిహుసి 500 ppm + ఇతిరిల్ 500 ppm 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
మోతాదుకు మించి నత్రజని వాడకుండా జాగ్రత్తపడాలి. కాయలు పెరిగే దశలో 100 లీటర్ల నీటికి 1 కిలో క్యాల్షియం క్లోరైడ్ + 1 కిలో మెగ్నీషియం కలిపి పిచికారి చేయాలి. తర్వాత 6 రోజులకు 100 లీటర్ల నీటికి 1.5 కిలో DAP + 500 గ్రాముల మెగ్నీషియం సల్పేట్ కలిపి పిచికారి చేయాలి. ఉద్బుతి ఎక్కువగా ఉన్నప్పుడు 100 లీటర్ల నీటికి 250 గ్రాముల బోరాన్ కలిపి పిచికారి చేయడం ద్వారా నాణ్యత కలిగిన పండ్ల దిగుబడి పొందవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

