Dragon Fruit | డ్రాగన్ ఫ్రూట్.. ఆదాయంతో పాటు ఆరోగ్యం.. సాగు ఈజీ..!
Dragon Fruit | డ్రాగన్ ఫ్రూట్ ( Dragon Fruit ).. ఈ పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఈ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ - సి, విటమిన్ - బి, ఐరన్, ఫాస్పరస్, కాల్షియంతో పాటు అనేక పోషక విలువలు ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి ఈ ఫ్రూట్ ఉపకరిస్తుంది. అలాగే, సీ విటమిన్ కూడా పుష్కలంగా

డ్రాగన్ ఫ్రూట్ ( Dragon Fruit ).. ఈ పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఈ ఫలం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ – సి, విటమిన్ – బి, ఐరన్, ఫాస్పరస్, కాల్షియంతో పాటు అనేక పోషక విలువలు ఉంటాయి. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి ఈ ఫ్రూట్ ఉపకరిస్తుంది. అలాగే, సీ విటమిన్ కూడా పుష్కలంగా లభించడంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్ని పోషకాలున్న ఈ ఫలాన్ని పండించిన వారికి సిరి సంపదలు వస్తే.. ఆ ఫలాన్ని తిన్నవారికి పోషకాలు మెండుగా లభిస్తాయనడంలో సందేహం లేనే లేదు. ఆదాయంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను ఎలా పండించాలో తెలుసుకుందాం.
సాగు ఈజీ..!
- మొదటగా రెండు డ్రమ్ములను ఏర్పాటు చేసుకోవాలి. ఆ డ్రమ్ముల్లో ఎర్ర మట్టి, కొబ్బరిపీచు, కంపోస్ట్ ఎరువుతో పాటు ఇసుకను నింపాలి. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు కానీ, మొక్కను కానీ నాటాలి.
- మీరు ఒక వేళ ఫ్రూట్‌ను ఆ మట్టిలో పాతాలనుకుంటే.. ఆ పండును కట్ చేసి నాలుగు రోజులు నీడలో ఉంచాలి.
- కట్ చేసిన ఫ్రూట్ డ్రై అయిన తర్వాత దాన్ని మట్టితో నింపిన డ్రమ్ముల్లో విత్తాలి. అనంతరం నీరు పోయాలి.
- ఇక సూర్యరశ్మి పుష్కలంగా లభించే ప్రాంతంలో ఆ డ్రమ్మును ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ఇది వేగవంతంగా పెరగాలంటే మంచి వెలుతురు తప్పనిసరి.
- ఈ మొక్క పెరుగుదలకు నీరు ఎక్కువగా అవసరం పడదు. ఒక వేళ పైభాగంలో ఉన్న మట్టి ఆరిపోయినట్లు అనిపిస్తే అప్పుడు సరిపోయిన మోతాదులో నీరు పోయాలి. ఎక్కువగా నీరు వినియోగిస్తే మొక్క నశించే పోయే అవకాశం ఉంటుంది.
- మొక్క ఒకసారి పెరగడం ప్రారంభమైన తర్వాత.. దీనికి ఒక కర్రను జత చేసి కట్టాలి. అప్పుడు మొక్క నిటారుగా పెరిగి ఫలాలను అందించడానికి వీలు ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ ఫలదీకరణ ఎలా?
మొక్క పెరిగిన తర్వాత దానికి పుష్పాలు వికసిస్తాయి. ఆడ పుష్పం యొక్క పుప్పొడిని మగ పుష్పంపై చల్లడంతో అది ఫలదీకరణం చెంది ఫలం రూపాంతరం చెందుతుంది. ఆడ పుష్పం పెద్దదిగా ఉండి, బాగా వికసించి ఉంటుంది. మగ పుష్పం మాత్రం చిన్నదిగా ఉండి.. తక్కువ స్థాయిలో వికసిస్తుంది. వికసించే స్థాయిల్లో తేడాలను గమనించి ఆడ, మగ పుష్పాలను గుర్తించి ఫలదీకరణం చేయాలి.
ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి..
మీరు ఈ మొక్కలను పెంచుకునేందుకు ఉపయోగించే డ్రమ్ము కనీసం 15 నుంచి 24 ఇంచుల వెడల్పు ఉండాలి. 10 నుంచి 12 ఇంచుల లోతు ఉండాలి. ఈ డ్రమ్ములకు కనీసం మూడు నుంచి నాలుగు రంధ్రాలను చేయాలి. మట్టి కుండలను కూడా వినియోగించొచ్చు. పెద్ద కుండలను, డ్రమ్ములను వినియోగిస్తే.. ఆ మొక్క వేర్లు విస్తారంగా వెళ్లి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ప్రతి రోజు ఈ మొక్కకు 8 గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా చూడాలి. చీడపీడల నుంచి కాపాడేందుకు సేంద్రియ ఎరువులను ఉపయోగించొచ్చు. మొక్క నాటిన తర్వాత 9 నుంచి 12 నెలల లోపు కాపు వస్తుంది.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

