Growth regulators | వృద్ధి నియంత్రకాలతో తోటల్లో దిగుబడి ఇలా..!
Growth regulators | పంటల పెరుగుదల, దిగుబడుల్లో సహజంగా ఉండే వృద్ధి నియంత్రకాలది ప్రధాన పాత్ర. వాణిజ్య పంటల్లో వీటి వాడకం వల్ల దిగుబడులు
పంటల పెరుగుదల, దిగుబడుల్లో సహజంగా ఉండే వృద్ధి నియంత్రకాలది ప్రధాన పాత్ర. కృత్రిమంగా తయారుచేసిన వృద్ధి నియంత్రకాల రాకతో వాటి వాడకం పెరిగింది. వాణిజ్య పంటల్లో వీటి వాడకం వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. వృద్ధి నియంత్రకాలలో ‘ఆక్సిన్’లు పూత శాతాన్ని, పండ్లు, గింజలు నిండటానికి ఉపయోగపడుతాయి. పూలు, మొగ్గలు, పిందెలు రాలకుండా ఉపయోగపడుతాయి. పండ్ల పరిమాణం, నాణ్యత పెరుగుదలలోనూ సహకరిస్తాయి.
అఫ్ఫా నాఫ్తైల్ అసిటిక్ అమ్లం కృత్రిమంగా ఎక్కువగా వాడుతున్న వృద్ధి నియంత్రకం. పంట మొక్కలలో సహజంగా వృద్ధి అయ్యే ‘ఎథిలీన్’ వాయువును మందగింపు జేసి ‘అబ్సిసిన్’ లేయర్ అభివృద్ధి చెందకుండా చేస్తుంది. తద్వారా మొగ్గలు, పూలు, పిందెలు రాలిపోకుండా ఉంటాయి.
వాడే విధానం
సాధారణంగా పంటలలో ఎన్ఎఎ వాడకాన్ని పీపీఎంల సిఫార్సు చేస్తారు. సాధారణంగా 10 పీపీఎం, 10 పీపీఎంలలో సిఫార్సు చేయబడుతుంది. 4.5 లీటర్ల నీటిలో ఒక మి.లీ. ఎన్ఏఏ కలిపితే 10 పీపీఎం, 10 మి.లీ. కలిపితే 100 పీపీఎం ద్రావకరం తయారవుతుంది. దీనిని పొద్దుగాల లేదా సాయంత్రం పూట మాత్రమే పిచికారీ చేయాలి. వృద్ధి నియంత్రకాన్ని మాత్రమే పంటలపై పిచికారీ చేస్తే ఫలితాలు బాగుంటాయి.
ఎన్ఏఏ వాడకం
మిరప: పూత సమయంలో మొదటిసారి పిచికారీ చేయాలి. 20-30 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.
టమాటా: పూతకు వచ్చే ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత మరోసారి పిచికారీ చేయాలి.
మామిడి: మామిడి పిందెలు బఠాని పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి పిచికారీ చేయాలి. ‘మాల్ ఫార్మేషన్’ సమస్య ఉన్నప్పుడు పూతకు మూడు నెలల ముందు ఒకసారి, పిందె ఎదిగే దశలో మరోసారి పిచికారీ చేయాలి.
ద్రాక్ష: మొదటి పిచికారీ కత్తిరింపులప్పుడు; పూత మొదల య్యే దశలో రెండోసారి పిచికారీ చేయాలి. ద్రాక్ష పండ్లు రాలకుండా ఉండేందుకు, గుత్తులు కోతకు 10-15 రోజుల ముందు ముదిరిన గుత్తులపై పిచికారీ చేయాలి.
ఫైనాపిల్: పూత దశకు ముందు ఒకసారి పిచికారీ చేయాలి. మొత్తం పండును ద్రావణంలో ఒక సెకను పాటు ముంచాలి. కోతకు రెండువారాల ముందు మరోసారి పిచికారీ చేయాలి. పూతకు -10 పీపీఎం.
పత్తి: పూత సమయం నుంచి 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు పిచికారీ చేయాలి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

