భారీగా.. భాస్వరం

207 మండలాల్లో అధికం
డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా॥ జగదీశ్వర్
తెలంగాణలోని అత్యధిక సాగుభూముల్లో ‘భాస్వరం’ ఎక్కువగా ఉన్నదని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా॥ జగదీశ్వర్ తెలిపారు. రైతులు మూసపద్ధతుల్లో భాస్వరం వంటి ఎరువులు వాడటం వల్ల పంటలకు నష్టమే వాటిల్లుతున్నదని హెచ్చరించారు. వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల 6వేల మట్టి నమూనాలను పరీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 53 శాతం నేలల్లో లభ్య భాస్వరం అధికంగా ఉన్నట్లు తేలిందని డా॥ జగదీశ్వర్ వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి జిల్లాలకు చెందిన 207 మండలాల్లోని 54 మండలాల్లో అధికంగా, 153 మండలాల్లోని పలు గ్రామాల్లో అత్యధికంగా ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు సాగుభూమిలోని మట్టి నమూనాల ఆధారంగా ఎరువులు వాడాలని ఆయన సూచించారు. కొన్నిచోట్ల భాస్వరం తక్కువగా ఉన్నట్లయితే, దానిని కరిగించే జీవన ఎరువులను రెండు, మూడేండ్లపాటు క్రమం తప్పక వాడితే ఫలితాలు వుంటాయని చెప్పారు. అధిక లభ్య భాస్వరమున్న నేలల్లో ప్రస్తుతం వాడుతున్న ఎరువులకన్నా 25నుంచి 50శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఇది పంటల దిగుబడిమీద ఎటువంటి ప్రభావం చూపదని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- farm lands
- Phosphorus
- soil
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

