హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సరోజ్ ఫ్యాబ్రిక్స్.. బంజారాహిల్స్‌లో తొలి షోరూమ్ ప్రారంభం
ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో తొలి షోరూం ప్రారంభమైంది. శనివారం నాడు నటి సోనియా సింగ్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా సింగ్ మాట్లాడుతూ.. సరోజ్ ఫ్యాబ్రిక్స్ ప్రారంభోత్సవంలో భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు.
ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో తొలి షోరూం ప్రారంభమైంది. శనివారం నాడు నటి సోనియా సింగ్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా సింగ్ మాట్లాడుతూ.. సరోజ్ ఫ్యాబ్రిక్స్ ప్రారంభోత్సవంలో భాగమవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం ఫాబ్రిక్ కాదని, ఇది మీ వాలెట్లలో సులభంగా ఉండే విలాసవంతమైన డిజైనర్ ఫ్యాబ్రిక్ అని సోనియా సింగ్ అన్నారు. మీ అన్ని డిజైనర్ అవసరాలకు ఇది వన్-స్టాప్ సొల్యూషన్ అని తెలిపారు. స్టైలింగ్ నుంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్, అన్స్టిచ్డ్ సూట్లు, దుపట్టాల వరకు అన్నీ ఇక్కడ కవర్ చేయబడ్డాయని చెప్పారు.
సరోజ్ ఫ్యాబ్రిక్స్ డైరెక్టర్ అశోక్ మోడీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అత్యుత్తమ ఫ్యాబ్రిక్స్ అనుభవాన్ని అందించడం పట్ల తాము సంతోషిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ అతిపెద్ద ఫ్యాబ్రిక్స్ షోరూమ్ డిజైనర్లకు ఒక వరం అవుతుందని అభిప్రాయపడ్డారు. పెళ్లిళ్లు, రోజువారీ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్ కోసం ఈ స్టోర్‌ను ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దామని తెలిపారు. దాదాపు 50 సంవత్సరాల నైపుణ్యంతో, సరోజ్ ఫ్యాబ్రిక్స్ ప్రజలకు అవసరమైన అన్ని శుభకార్యాలతో పాటు, ఫ్యాషన్ డిజైనర్లు, సినిమాలు, సీరియల్స్, ఎగుమతిదారులు, బోటిక్ యజమానులు, ఫ్యాషన్ పరిశ్రమకు అత్యుత్తమ నాణ్యత గల బట్టలను సరఫరా చేయడం ద్వారా నమ్మకాన్ని సంపాదించుకుందని స్పష్టం చేశారు. ఫ్యాన్సీ సిల్క్ల నుంచి క్లాసీ లినెన్ల వరకు, అందమైన ప్రింట్ల నుంచి సున్నితమైన ఎంబ్రాయిడరీల వరకు, పెళ్లి దుస్తులు, రోజువారీ దుస్తులకు అవసరమైన అన్ని వస్త్రోత్పత్తులను బంజారాహిల్స్ స్టోర్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. వరుడికి కుర్తాలు, షేర్వానీలు, జాకెట్లతో పాటు.. కుటుంబసభ్యుల కోసం బ్రోకేడ్, సిల్క్స్, వెల్వేట్ వంటి ఫ్యాబ్రిక్స్‌లో అవసరమైన దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.
సరోజ్ ఫ్యాబ్రిక్స్ గురించి:
సరోజ్ ఫ్యాబ్రిక్స్ 1976లో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మొదట హోల్‌సేల్ టెక్స్టైల్ వ్యాపారంగా మొదలైన ఈ సంస్థ.. ఇప్పుడు భారీ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చెందింది. ప్రతి వ్యక్తికి అత్యున్నత స్థాయి ఫ్యాబ్రిక్స్ అందించడంతో పాటు కస్టమర్లకు అందుబాటులో ఉండటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రోజువారీ ఫ్యాషన్, ఇండియన్, వెస్టర్న్, వధూవరులకు కావాల్సిన దుస్తులతో పాటు అన్ని ఈవెంట్లకు తగిన దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎంబ్రాయిడరీలు, ప్రింట్లు, డిజైన్లు, రంగులు ఫ్యాషన్‌లోని తాజా ట్రెండ్లతో ప్రతిరోజూ దర్శనమిస్తాయి.
Read Today's Latest Advertisement News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


