షటిల్ వైపు.. యువత చూపు
యువత షటిల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. శారీరక ధారుడ్యానికి, మానసికోల్లాసానికి ఈ ఆటను ఎంచుకుంటున్నారు. పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. బోథ్‌కు చెందిన 20 మంది యువకులు నిత్యం షటిల్ సాధన చేస్తున్నారు.
- పన్నెండేళ్లుగా సాధన
- శారీరక ధారుడ్యం,మానసికోల్లాసానికి ఉపకరణ
బోథ్, డిసెంబర్ 10: యువత షటిల్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. శారీరక ధారుడ్యానికి, మానసికోల్లాసానికి ఈ ఆటను ఎంచుకుంటున్నారు. పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. బోథ్‌కు చెందిన 20 మంది యువకులు నిత్యం షటిల్ సాధన చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం షటిల్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నెలా ఆట వస్తువులు, నిర్వహణ కోసం రూ. 500ల చొప్పున జమ చేసుకుంటున్నారు. షటిల్ కాక్‌లు, నెట్స్, ఫ్లడ్ లైట్లు తదితర వాటి కోసం ఖర్చు చేసుకుంటున్నారు. సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు, ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు సాధన చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. సింగిల్, డబుల్స్ విభాగంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వ్యాయామం కోసం నడక, రన్నింగ్ వంటి వాటికి బదులుగా ఎక్కువ శ్రమ కలిగించే షటిల్ ఆడుతున్నారు. అందరూ ఆడే విధంగా సమయం కేటాయించుకుంటూ నిత్యం సాధన చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని ఖానాపూర్, లక్ష్మణచాంద, ఉట్నూర్, ఆదిలాబాద్, బోథ్, జాతర్లలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఈ బృందంలోని సభ్యులు పాల్గొని పలు మార్లు బహుమతులు సాధించారు. బూస లక్ష్మణ్, అప్పాల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పలు మార్లు జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. షటిల్ ఆడడం ద్వారా శారీరక శ్రమతో పాటు మానసికంగా ఉల్లాసం లభిస్తున్నదని పేర్కొంటున్నారు.
పన్నెండేళ్లుగా ఆడుతున్నా..
పన్నెండేళ్లుగా షటిల్ ఆడుతున్నా. మా స్నేహితులందరం కలిసి నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాం. షటిల్ ఆడితే మూడు, నాలుగు కిలోమీటర్లు నడక, పరుగు తీసినంత శ్రమ కలుగుతుంది. ఈ ఆటతో శరీర భాగాలన్నింటిలో కదలిక వస్తుంది. షటిల్ ఆటపై ఉన్న మక్కువతో నిత్యం స్నేహితులతో కలిసి ఆడుతున్నాను. షటిల్ ఆడేవాళ్లందరం గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం.
బూస లక్ష్మణ్, షటిల్ క్రీడాకారుడు,
బాడీ రిలాక్స్ అవుతున్నది…
షటిల్ ఆడితే బాడీ రిలాక్స్ అవుతున్నది. శారీరక శ్రమ ఎక్కువ చేసినట్లుగా అనిపిస్తున్నది. పన్నెండేళ్లుగా నిత్యం ఉదయం, సాయంత్రం సమయాల్లో వీలును బట్టి సాధన చేస్తున్నాం. మాలాంటి యువకులు చాలా మందికి ఆటలు ఆడాలనే తపన ఉన్నా బోథ్‌లో సరిపడా సౌకర్యాలు లేవు. ఇక్కడ మినీ స్టేడియం నిర్మిస్తే చాలా మంది యువకులు క్రీడలపై దృష్టి సారిస్తారు.
అప్పాల శ్రీనివాస్‌రెడ్డి, షటిల్ క్రీడాకారుడు
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- Shuttle
- shuttle game
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

