క్షణికావేశం… మరణ శాసనం
మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో, భావోద్వేగాలు నియంత్రణ లేక క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇక బతకలేమని నిర్ణయించుకొని ఆత్మహత్యలకు కారణమవుతున్నారు.
- నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్ 9 : మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో, భావోద్వేగాలు నియంత్రణ లేక క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇక బతకలేమని నిర్ణయించుకొని ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. ఇలా రెండు, మూడు రోజులకు ఒక చోట పలు కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, క్షణికావేశంలో బలవన్మరణం ఆలోచనలు రానివ్వద్దని, ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం కాదని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఇటీవల లోకేశ్వరం మండలంలో ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వ్యాధి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
గత నెల చివరి వారంలో దస్తూరాబాద్ మండలం రాంపూర్‌లో ఓ వివాహిత అనారోగ్యం కారణంగా ఇంటివద్ద ఉన్న బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
కాసిపేట మండలం దేవాపూర్‌లో ఓ వ్యక్తి మద్యానికి బానిసై జీవితం పై విరక్తి చెంది చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్షణికావేశంతో నిండు జీవితాలు బలవుతున్నాయి. చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువతీ, యువకులు ఉంటున్నారు. ప్రేమ, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, చదువులో ఒత్తిళ్లు, నిరుద్యోగం, ఇలా ఏదో ఒక సమస్య కారణంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. లైంగిక వేదింపులకు గురైన వారు సమస్యలను అధిగమించలేక మానసిక ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన యువకులు తమ కళ్లెదుటే తనువు చాలించడం వల్ల వారి గుండె తల్లడిల్లిపోతున్నది. భార్యభర్తల్లో ఒకరు దూరమై, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల పిల్లలు అనాథలు అవుతున్నారు. చాలా కుటుంబాల్లో చేతికందిన కొడుకు చనిపోతే తల్లిదండ్రులు వీధిన పడిన సంఘటనలు ఉన్నాయి. క్షణికావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. చనిపోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ సమయంలో కుదుటబడి సమస్యను ఎదుర్కొంటే ఆ తర్వాత జీవితం సానుకూల ధోరణితో సాగుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. బాల్యం నుంచే ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని భావోద్వేగాలు నియంత్రించేందుకు పునాదులు వేసుకొని జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకొని తొలుత వాటిని సాధించడంపై దృష్టి సారించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న గొడవలు చిలికిచిలికి గాలివానల మారకుండా పెద్దలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేసుకుంటే ఆత్మహత్యలను నివారణించేందుకు మార్గం ఏర్పడుతుంది.
క్షణికావేశంతో బలవన్మరణ ఆలోచనలు రానివ్వొద్దు
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. క్షణికావేశంలో బలవన్మరణ ఆలోచనలు రానివ్వొద్దు. మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో అన్ని వర్గాల వారికి అవగాహన రావాలి. భావోద్వేగాలు నియంత్రించుకునేలా చేయాలి. పిల్లలు ఎక్కువగా సెల్ఫోన్లకు బానిసవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం గమనించాలి. వారితో ఎక్కువ సమయం గడిపేలా చూడాలి. ఎవరైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే కుటుంబ సభ్యులు గుర్తించి దవాఖానలో కౌన్సెలింగ్ చేయించాలి. ఇక బతకలేమని నిర్ణయించుకునే వారు తరచూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెబుతుంటారు. వారి సమస్యను పట్టించుకొని వారికి మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తే ప్రాణాలు నిలబట్టే ఆస్కారం ఉంది.
-అల్లాడి సురేశ్, జిల్లా మానసిక వైద్యాధికారి, నిర్మల్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

