ఆదిలాబాద్‌లో ట్రాక్టర్, మినీ లారీ ఢీ.. ముగ్గురు మృతి
ఆదిలాబాద్| ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఆదిలాబాద్: జిల్లాలోని గుడిహత్నూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను మినీ లారీ ఢీకొన్నాయి. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్టర్ డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను లారీ డ్రైవర్ రామాంజనేయులు, క్లీనర్ ఖాజా, ట్రాక్టర్‌పై కూర్చున్న మరో వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు పంపించారు. మినీ లారీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మారం నుంచి టమాటా లోడుతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

