కౌటాల : ఆదిలాబాద్ జిల్లా కౌటాల (Koutala) మండల కేంద్రం ప్రగతి కాలనీలో బొమ్మ కంటి స్ఫూర్తి (16 ) అనే పదవ తరగతి విద్యార్థి శనివారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య (Student Suicide) చేసుకున్నట్లు ఎస్సై మధుకర్ (SI Madhukar) తెలిపారు. ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా పాఠశాలకు వెళ్లి వచ్చి తండ్రి తో పాటు ఇంటికి చేరుకుందని తెలిపారు.
స్టడీ మెటీరియల్ (Study Metirial) కోసం తల్లిని ఫోన్ (Phone) అడగగా ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మృతురాలి తండ్రి సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు .