సారె మురిపెం
రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నది. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగలకు కానుకలు అందజేస్తున్నది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈ యేడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నది. గతంలో కంటే రంగు రంగుల డిజైన్లలో ఆకట్టుకునేలా చీరలను తయారు చేశారు
- కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ
- కానుకలు అందుకొని సంబుర పడుతున్న ఆడబిడ్డలు
- సీఎం కేసీఆర్ సల్లంగుండాలంటూ దీవెనలు
రాష్ట్ర సర్కారు అన్ని వర్గాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నది. రంజాన్, క్రిస్మస్, దసరా పండుగలకు కానుకలు అందజేస్తున్నది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈ యేడాది కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నది. గతంలో కంటే రంగు రంగుల డిజైన్లలో ఆకట్టుకునేలా చీరలను తయారు చేశారు. పండుగకు ముందే చీరలు పంపిణీ చేస్తుండగా, మహిళలు ఉత్సాహంగా అందుకొని మురిసిపోతున్నరు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా ఆలోచించింది లేదని, ఆడబిడ్డలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరలు ఇస్తున్నారని, ఆయన సల్లంగుండాలని, జీవితాంతం ఆయన వెన్నంటి నడుస్తామని మహిళలు దీవెనలు అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం..
మందమర్రి, సెప్టెంబర్ 29 : మన ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగా పాలన చేసినోళ్లను ఇంత వరకు చూడలేదు. అందరూ బాగు పడాలని అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నడు. ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ సంబురంగా జరుపుకునేలా పెద్దన్న లెక్క చీరలు పంచిపెడుతున్నడు. చీరను తీసుకున్నప్పుడు నా పుట్టింటి వారు చీర కొనిచ్చినట్లనిపించింది. పేదల కష్టాలు తెలిసిన వారే ఇలాంటి మంచి పనులు చేస్తారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం. – రంగు విజయ, మందమర్రి
చీరల కోసం ఎదురుచూస్తం..
మందమర్రి, సెప్టెంబర్ 29 : బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయడం బాగుంది. అన్ని వర్గాల ప్రజల ఇండ్లలో పండుగ వెలుగులు నింపాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం గొప్పది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యేటా బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రభుత్వం ఎప్పుడు చీరలు అందిస్తుందా అని ఎదురు చూస్తం. పేదలకు సీఎం కేసీఆర్ చేస్తున్న మేలు మరువలేనిది. – సల్లం శారద, మందమర్రి
చీరలు బాగున్నయ్..
రెబ్బెన, సెప్టెంబర్ 29 : సీఎం కేసీఆర్ అందించే బతుకమ్మ చీరలు చాలా బాగున్నయ్. నాణ్యతతో పాటు వివిధ రంగు ల్లో అందించడం గొప్ప విష యం. ఆడబిడ్డలకు చీరలు అందిస్తున్న సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలె. పండుగకు ముం దే చీరలు అందించడం సంతోషం గా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా బాగున్నయ్. అందరూ సంతోషంగా తీసుకొని మురిసిపోతున్నరు. పండుగకు కట్టుకుందామని అందరం అనుకుంటున్నం.
– కుందారపు శంకరమ్మ, రైతు బంధు సమితి జిల్లా సభ్యురాలు
పుట్టింటి చీర అందుకున్నట్లుంది
మందమర్రి, సెప్టెంబర్ 29 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలందరికీ పెద్దన్నగా అండగా నిలుస్తున్నాడు. యేటా బతుక మ్మ పండుగకు చీరలు పంపిణీ చేస్తూ మహిళలపై ఉన్న గౌరవా న్ని తెలియజేస్తున్నాడు. పుట్టింటి నుంచి సారే పెట్టినట్లుగా అనిపిస్తోంది. ఇది వరకు ఉన్నోళ్లు ఇట్లాంటి ఆలోచన చేసింది లేదు. – కుదిరె వజీర, మందమర్రి
చీరల రంగులు మంచిగున్నయ్
మందమర్రి, సెప్టెంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు అందిస్తున్న చీరలు మస్తు మంచిగున్నయ్. రంగు రంగుల డిజైన్లలో తయారు చేశారు. ఈసారి ఇదే చీర కట్టుకుని బతుకమ్మ ఆడుత. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న లెక్క ఆడబిడ్డలందరూ ఆనందంగా బతుకమ్మ ఆడుకోవాలని ఈ ఆలోచన చేసిండు. అందరి బాగోగులు చూసుకునే ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలి. – కే భవాని, మందమర్రి
పెద్దన్నలా చీర పంపుతున్నడు..
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 29 : ప్రతి బతుకమ్మ పండుగకు పుట్టింటి పెద్దన్నలా మాకు సీఎం కేసీఆర్ సారు చీర పంపుతున్నడు. తెలంగాణ సంస్కృతిలో పండుగల వేళా ఆడబిడ్డకు సారె పెట్టుడు సంప్రదాయంగా వస్తున్నది. అదే సీఎం కేసీఆర్ సారు చేస్తున్నడు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలనే రంగురంగుల చీరెలు అందిస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇట్ల ఆడబిడ్డల గురించి ఆలోచించింది లేదు. నాతో పాటు చాలా మంది ఈ చీరలు తీసుకొని సంతోషపడ్డరు.
– సదాల దివ్య, కాగజ్‌నగర్
నాకు నచ్చిన చీర తీసుకున్న..
కౌటాల, సెప్టెంబర్ 29 : ఈ సారి నాకు నచ్చిన చీర తీసుకున్న. బతుకమ్మ పండుగకు దుకాణాలకు వెళ్లి మనకు నచ్చిన చీర ఎట్ల తీసుకుంటమో సర్కారోళ్లు కూడా అట్లనే నాకు నచ్చిన చీర ఇచ్చిండ్రు. పండుగకు ఇన్ని రోజుల ముందే చీర ఇచ్చుడు తోటి పండుగ టైంకి జాకెట్ కుట్టించుకొనుడు కూడా అయితది. ఇంత మంచిగా ఎవలూ మాకు పండుగకు చీరలు, సారెలు ఇవ్వలేదు. కేసీఆర్ సారు వచ్చినంక ఆడబిడ్డలందరికీ చీరలు ఇస్తున్నడు. తెలంగాణకు మంచి చేసుడంటే అది సీఎం కేసీఆర్‌తోనే అయితది.
– నేరెళ్ల పద్మ, ముత్తంపేట
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

