అరణ్యంలో పాఠాలు
నిర్మల్ జిల్లాలోని పెంబి అడవుల్లో సిద్దిపేట్ జిల్లా ప్రభుత్వ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు క్షేత్రస్థాయి తరగతులు నిర్వహిస్తున్నారు. పది రోజులుగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై సీనియర్ అధికారులు శిక్షణనిస్తున్నారు. నీటి కుంటలు, సాసర్‌పిట్, గ్రాస్ ప్లాంటేషన్
- పెంబి అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ కాలేజీ విద్యార్థులకు తరగతులు
- అడవి,వన్యప్రాణుల సంరక్షణపై శిక్షణ
నిర్మల్ జిల్లాలోని పెంబి అడవుల్లో సిద్దిపేట్ జిల్లా ప్రభుత్వ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు క్షేత్రస్థాయి తరగతులు నిర్వహిస్తున్నారు. పది రోజులుగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై సీనియర్ అధికారులు శిక్షణనిస్తున్నారు. నీటి కుంటలు, సాసర్‌పిట్, గ్రాస్ ప్లాంటేషన్, స్మగ్లింగ్ కట్టడి, జంతువుల వేట నివారణ, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రాత్రివేళల్లో ఫారెస్ట్ సిబ్బందితో కలిసి గస్తీ తిరుగుతున్నారు.
పెంబి, సెప్టెంబర్ 2: ప్రభుత్వ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట విద్యార్థులు పెంబి అడవుల్లో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. పది రోజుల నుంచి మండల కేంద్రంలోని ఫారెస్ట్ క్వార్టర్స్‌లో ఉంటూ అధికారులతో అడవుల్లో పర్యటిస్తూ శిక్షణ పొందుతున్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై పరిశోధన చేస్తున్నారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలు, సాసర్‌పిట్, గ్రాస్ ప్లాంటేషన్లను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కలప స్మగ్లింగ్, వన్య ప్రాణుల వేటను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.
స్మగ్లింగ్ నియంత్రణఖు రాత్రి వేళల్లో అధికారులతో గస్తీ నిర్వహిస్తున్నారు. ఎఫ్‌డీవో కోటేశ్వర్ రావు, ఎఫ్ఆర్వో రామకృష్ణ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. పెంబి రేంజ్ పరిధిలోని దట్టమైన అడవుల అందాలు, వన్య ప్రాణుల సంచారంతో ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ఇక్కడ పర్యటించి పొందిన అనుభూతులు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడవులు, వన్య ప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న విధానాలు బాగున్నాయన్నారు. పరిశోధనలో సేకరించిన వివరాలను నిర్మల్ డీఎఫ్‌వో, కాలేజ్‌లో సమర్పించనున్నట్లు విద్యార్థులు వెల్లడించారు.
ప్రభుత్వ విధానాలు భేష్
పెంబిలోని దట్టమైన అడవులు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ పర్యటించి చాలా విషయాలు తెలుసుకు న్నా. అడవులు, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు చాలా బాగున్నాయి. అడవుల్లో ఏర్పాటు చేసినా నీటి కుంటలు, గ్రాస్ ప్లాంటేషన్ ఆకట్టుకున్నాయి. ఎఫ్‌డీవో, ఎఫ్ఆర్వోలు ప్రత్యేకంగా సమయం కేటాయించి మాకు అన్ని అంశాలపై అవగాహన కల్పించారు. ఇక్కడ పరిశీలించిన విషయాలు కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులతో పంచుకుంటాను.
– రవివర్మ, ఫారెస్ట్ కాలేజ్ విద్యార్థి, వరంగల్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

